“కరోనా వైరస్ : హౌ టు ఐసోలేట్‌ యువర్‌ సెల్ఫ్”…? “సోనీ బీబీసి ఎర్త్”లో తప్పక చూడండి…!

-

కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే స్వీయ నియంత్రణ ఉండాలి. సామాజిక దూరం పాటించడం తో పాటుగా సెల్ఫ్ ఐసోలేషన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనం దాని బారి నుంచి బయట పడతాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఇదే చేస్తుంది. కరోనా బాధిత దేశాల్లో దాదాపు 70 శాతం మంది ఇదే విధంగా ఐసోలేషన్ లో ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ చానల్ సోనీ బీబీసి ఎర్త్ లో భారత్ కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు.

కరోనా వైరస్; హౌ టూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అనే పేరుతో ఒక గంట కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు. దీనిలో డాక్టర్ ఎక్సాండ్ వాస్ తులేకేస్, మరియు మానసిక వైద్య నిపుణులు కింబర్లె విల్సన్ ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కరోనా గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఇది మంచి కార్యక్రమం అని అంటున్నారు. దీనిలో విలువైన సమాచారం అందిస్తారు, అలాగే కరోనాను ఎదుర్కోవడానికి విలువైన చిట్కాలు సలహాలను అందిస్తారు.

ఎక్సాండ్ అనే వైద్యులు యుకెలోని జనరల్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన డాక్టర్. అలాగే ఆయన మంచి ప్రేజెంటర్ కూడా అని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలకు వివరించడానికి గానూ ప్రముఖ నిపుణులను కలుసుకుని వాటిని వివరిస్తారు. సెల్ఫ్ ఐసోలేషన్ కరోనా వైరస్ కి ఎంత విలువైనదో ఆయన వివరించే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ప్రజలు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక కింబర్లె విషయానికి వస్తే ఈ సమయంలో ఎదుర్కొనే మానసిక సమస్యలను ఆయన వివరిస్తారు. ఈ డాక్యు ఫిలిం లో ఇవి చాలా ప్రధానం. అలాగే ఉత్కంట ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ సమయంలో తీసుకునే జాగ్రత్తలను కూడా వివరించనున్నారు. కరోనా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్లకు ఇది విలువైన సమాచారం అందిస్తుంది అంటున్నారు. ప్రతీ రోజు సోనీ బీబీసి ఎర్త్ లో ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news