Viral Video : వావ్ అద్భుతం.. ఇలాంటి క్యాచ్​ ఎక్కడైనా చూశారా?

-

క్రికెట్.. ఇండియాలో సూపర్ క్రేజ్ ఉన్న ఆట. ఇండియన్ క్రికెట్ లో ఇప్పటికే చాలా అద్భుతాలు జరిగాయి. కొందరు బ్యాటింగ్ తో.. మరికొందరు బౌలింగ్ తో.. ఇంకొందరు ఫీల్డింగ్ తో .. ఇలా రకరకాలుగా అద్భుతాలు సృష్టించారు. కొంతమంది క్రికెటర్లు వినూత్నమైన షాట్లు ఆడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

తాజాగా ఓ మ్యాచ్‌లో ఓ ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకుని శభాష్‌ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫీల్డర్‌ ఏం చేశాడంటే.. బౌండరీ లైన్‌ వద్ద బంతిని అందుకుని బ్యాలెన్స్‌ కంట్రోల్ కాకపోవడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. అతడు గాల్లోకి ఎగిరే కాలితో బంతిని గ్రౌండ్‌లోకి తన్నాడు. వెంటనే వేరే ఫీల్డర్‌ వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు.

ఈ వీడియో చూసి క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్‌, మైఖేల్ వాన్‌, న్యూజిలాండ్ ఆటగాడు జిమ్మీ నీషమ్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీరు ఫుట్‌బాల్ ఆడటం కూడా తెలిసిన క్రికెటర్‌ని ఆడిస్తే ఇలా జరుగుతుంది!!’ అని సచిన్‌ ట్వీట్ చేశాడు. నీషమ్‌.. కచ్చితంగా ఇది అద్భుతమైన క్యాచ్‌ అని ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news