దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. బాహుబలి సినిమాకు సైతం కథ అందించారు విజయేంద్రప్రసాద్.. అయితే ఈయన ఒక హిందీ సినిమాకు కథ అందించే విషయంలో చాలా కమర్షియల్ గా వ్యవహరించారని వార్తలు వినిపిస్తున్నాయి..ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించారు.. ఈయన కథ అందించిన బాహుబలి సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే.. అలాగే ఇప్పటివరకు బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సింహాద్రి, సై, సమరసింహారెడ్డి, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, రాజన్న వంటి ఎన్నో చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.. వీటితో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాలకు సైతం కథలు అందించారు.. అయితే ఈయన ఒక సినిమాకు కథ అందించే విషయంలో చాలా కమర్షియల్ గా వ్యవహరించారని అతను అడిగిన డబ్బులకు రూపాయి తగ్గిన కథ ఇచ్చేదే లేదు అంటూ తేల్చి చెప్పేసారని తెలుస్తోంది..
బాహుబలి సినిమా సమయంలోనే విజయేంద్ర ప్రసాద్ బజరంగీ భాయిజాన్ సినిమా కథను కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ ను మొదటగా అమీర్ ఖాన్ కి చెప్పగా అతనికి కథ నచ్చలేదంట.. తర్వాత ఇదే కథను సల్మాన్ ఖాన్ కు వివరించగా చాలా నచ్చి సినిమా చేయడానికి ఒప్పేసుకున్నారట.. సల్మాన్ ఖాన్ ఒక బడా నిర్మాతకు ఈ కథను చెప్పమనగా విజయేంద్ర ప్రసాద్ కథ చెప్పగా 20 లక్షలు అడ్వాన్స్గా ఇస్తానని అన్నారట. అలాగే వీటితో పాటు మరొక 20 లక్షలు ఇస్తానని చెప్పగా విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.. ఈ కథకి అంతా శక్తి ఉంది.. అలాంటిది 20 లక్షలతో సరిపెట్టేస్తే అవ్వదు. రెండు కోట్లకు రూపాయలకు రూపాయి తగిన సినిమా కథ ఇవ్వను అంటూ తేల్చి చెప్పేసారట. దాంతో ఆ నిర్మాత వెనక్కి తగ్గగా మరొక నిర్మాతను సల్మాన్ ఖాన్ సూచించగా అతను రెండు కోట్లు ఇచ్చి వెంటనే కథను తీసేసుకున్నారని తెలుస్తోంది..