కరోనా లాక్ డౌన్ సమయంలో జనాలు బయటకు రాకుండా ఇళ్ళకు మాత్రమే పరిమితం కావడంతో ఇప్పుడు అడవి జంతువులు, సరీసృపాలు బయటకు వస్తున్నాయి. జనాల్లోకి వచ్చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా… తాజాగా అమెరికాలో ఒక భయంకర సంఘటన జరిగింది. యుఎస్‌లోని సౌత్ కరోలినాకు చెందిన ఒక కుటుంబం సోమవారం తమ ఇంటి పెరట్లో ఒక మొసలి దానికి కోపం వచ్చి సృష్టించిన విధ్వంశం చూసి భయపడిపోయారు.
హిల్టన్ హెడ్ పట్టణంలో బిగ్ జార్జ్ అని పిలవబడే మొసలి చేసిన నాశనం అంతా ఇంతా కాదు. సాధారణంగా అవి పెరట్లోకి వస్తు ఉంటాయట. అయితే ఈసారి పెరట్లోకి వచ్చిన సమయంలో ఒక మొసలి… అక్కడ ఉన్న వారి ఆస్తిని కూడా నాశనం చేసింది. ఇంటి బయట ఉన్న సామాన్లను పాడు చేయడంతో పాటుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. “మేము ప్రతిరోజూ వాటిని చూస్తాము, కానీ పెరటిలో ఎప్పుడూ అన్నింటినీ పడగొట్టడం చూడలేదు అని పేర్కొన్నారు ఇంటి యజమాని ఫెర్నాండో లోసాడా.
వారి ఇంటి ముందు ఇంటి వెనుక కూడా మొసలి ఉండే మడుగులు ఉన్నాయి. దీనితో ఇంట్లో ఉండే పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న అధికారులు నలుగురు గార్డులను అక్కడికి పంపించారు. నానా కష్టాలు పడి వాళ్ళు దాన్ని అదుపు చేసి తిరిగి మడుగులోకి పంపించారు. మరి దానికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు.
Please 2020 stop!!!! #quarentine #alligator #seapines #backyard #alligators #matingseason #hh #hiltonheadisland #reptiles #stayathome #homeinvation #tmz #naturee #lockdown #todayanimals #nature #reptile #wildlife #caiman #reptilesofinstagram #gator #crocodile #life #photography
Posted by Fernando Lossada on Monday, 20 April 2020