విద్యార్ధుల కోసం వాట్సాప్ పాఠాలు, అదిరిపోయే ప్లాన్ వేసిన టీచర్…!

-

కరోనా లాక్ డౌన్ తో చాలా మంది విద్యార్ధులు నష్టపోతున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా కూడా విద్యార్ధులు చదువుకునే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టమవుతుంది. రోజు రోజుకి కరోనా పెరిగే అవకాశాలు గాని తగ్గే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. ఈ నేపధ్యంలో విద్యార్ధుల చదువుకోవడానికి గానూ ఆన్లైన్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే జరుగుతుంది.

దీనితో ఇప్పుడు ఉపాధ్యాయులు తమ విద్యార్ధుల కోసం కొత్తగా ఆలోచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్ గ్రామంలో ప్రభుత్వం నడుపుతున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలకు పాఠాలను చెప్పడానికి గానూ… వాట్సాప్ ని ఎంచుకున్నాడు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసారు. ఇప్పటివరకు, 16 మంది పిల్లలు ఆన్‌లైన్ తరగతుల కోసం గ్రూప్ లో జాయిన్ అయ్యారు.

“మేరా విద్యాలయ్, మేరా పరివార్” పేరుతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసాడు. బెల్వా పాడుమ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రీతి మిశ్రా మాట్లాడుతూ, ప్రారంభించిన రోజున ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారని… “ఈ బృందంలో ఇప్పటివరకు 16 మంది పిల్లలు ఉన్నారు, కానీ వారి ఉత్సాహాన్ని చూస్తే, ఈ ప్రయత్నం ఫలవంతమై౦దని పేర్కొన్నారు. దీనిపై విద్యార్ధుల తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news