వైరల్ వీడియో: వ్యాపారి కూతురిపై కాల్పులు జరిపిన దుండగుడు

-

బీహార్‌లోని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాట్నాలోని సిపారా ప్రాంతంలో ఓ కూరగాయల వ్యాపారి కూతురిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి పారిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువతికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి వీధిలోనుంచి వస్తుండగా.. అక్కడే ఓ యువకుడు వేచి ఉన్నాడు. యువతి దుండగుడి పక్క నుంచి వెళ్లిన తర్వాత.. దుండగుడు అతనితో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు.

యువతి-కాల్పులు
యువతి-కాల్పులు

ఆమె మెడపై కాల్పులు జరగడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి న్న యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే కాల్పులు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news