సాధారణంగా సింహానికి ఎదురు పడితే పరిస్థితి ఏంటీ…? ఏముంది? చక్కగా పలహారం అయిపోవడమే. ఇక మనం వెళ్ళే దారిలో సింహం ఎదురుపడితే అది ఏమీ చేయక ముందే గుండెలు జారిపోతాయి. బతుకు జీవుడా అంటూ అది వదిలేస్తే చాలు అనుకుంటూ ఉంటాం. దేవుడుకి దండం పెట్టుకుంటూ మమ్మల్ని ఈ నిమిషం బ్రతికిస్తే చాలు అనుకుంటూ ఉంటాం కదా…?
ఒక వ్యక్తికి అలాంటి పరిస్థితి ఎదురైంది. గుజరాత్ లోని గిర్ అటవి ప్రాంతంలో ఒక వ్యక్తికి ఇదే సీన్ ఎదురైంది. రాజ్యసభ ఎంపి పరిమల్ నాథ్వానీ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఒక సింహం తన పిల్లలతో కలిసి ఒక రోడ్డులో వెళ్తూంది. అలా అవి వెళ్తూ ఉండగా ఆ తల్లిపిల్లలకు ఒక బండి ఎదురైంది. దానిపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.
వాటిని చూడగానే బైకర్ తన బండిని ఆపేసాడు. ఆశ్చర్యకరంగా ఆ మూడు ఏమీ చేయకుండా పక్కకు వెళ్లిపోవడంతో బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్న వారు, వెంటనే బండి స్టార్ట్ చేసి బయటపడ్డారు
. గుజరాత్ లోని గిర్ అభయారణ్యం శివార్లలో ఇంకో ప్రయాణికుడు తీసిన ఈ వీడియోలో, “ఈ వైరల్ వీడియో… శివార్లలోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గంలో సింహం తన పిల్లలు బైకర్ కు దారి ఇచ్చాయి. గిర్ అభయారణ్యం లో ఇది జరిగింది. అవి మానవుల స్థలాన్ని గౌరవించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ” అని పేర్కొన్నారు. 36 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనది నాగరిక దేశం కాబట్టి మన సింహాలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయని ఎదుటి వారికి హాని చేయడం లేదని కామెంట్ చేసారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది.
This #viralvideo shows a #Lioness & two cubs moving away to give way to a biker on the way to his farm near a village on the outskirts of #Gir sanctuary. It is amazing to see them respecting humans' space. @ParveenKaswan @SanctuaryAsia @WWFINDIA @susantananda3 @NatGeoIndia pic.twitter.com/9yPM7Vvldc
— Parimal Nathwani (@mpparimal) February 3, 2020