అసలు ఈ మిడతల గోల ఏంటీ…? ప్రపంచాన్ని ఎందుకు భయపడుతున్నాయి…!

-

సొమాలియా ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే అదేదో పొరుగుదేశం చేస్తుందని అనుకోకండి,అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.సొమాలియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని చాలా దేశాలపై లక్షలాది మిడతలు అక్కడి పొలాలపై దాడి చేసి పంటలను సర్వనాశనం చేస్తున్నాయి.

సొమాలియాలో పండుతున్న పంటలో చాలా భాగాన్ని మిడతలే తినేస్తున్నాయి.అంతంతమాత్రంగా ఉన్న ఆ దేశ ఆహార భద్రతకు ఈ పరిణామం వల్ల మరింత నష్టం కలుగుతుంది అని సోమాలియా వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ నెలలో కోతలు మొదలయ్యేసరికి కూడా ఈ పరిస్థితి మారే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ మిడతల దాడి జరుగుతోందని ఐక్య రాజ్య సమితి కూడా చెబుతోంది.

ఇక కెన్యాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 70ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ కీటకాలు అక్కడి పొలాలపై దాడి చేస్తున్నాయి.

ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తొలి దేశం సొమాలియానే.ఇక్కడి భద్రతా కారణాల వల్ల విమానాల ద్వారా పంటలపై పురుగు మందులు చల్లే పరిస్థితి కూడా లేదు. ఈ కారణంగా లక్షలాది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడింది.

ఆఫ్రికాలో మిడతల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 500 రెట్లు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి దీనిపై అంతర్జాతీయంగా ఆ దేశాలకు సాయం అవసరమని గత నెలలో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ కోరింది.

ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ నుంచి ఈ మిడతలు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి.రోజుకి మిడతలు 150 కి.మీ.ల దాకా ప్రయానం చేయగలవు.ఒక మిడత రోజుకి సగటున దాని బరువుకు సమానమైన ఆహారాన్ని తింటుంది. గత ఏడాది చివర్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఈ రకమైన వాతావరణం ఇవి వృద్ధి చెందటానికి అనుకూలించింది అని అక్కడివారు అంటున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news