టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో విదేశాల్లో.. అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డులలోకి ఎక్కారు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి వన్డే లో తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ రికార్డును సాధించాడు విరాట్ కోహ్లీ.
ఇక అంతకు ముందు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 5065 పరుగులతో… ఉన్న ఆ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 4520 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 3998 పరుగుల, సౌరవ్ గంగూలీ 3468 పరుగులు చేసి.. సచిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా…
తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 31 పరుగుల తేడాతో ఇండియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. కెప్టెన్ టెంబా బవుబా 110, రాసీ వాన్ డెర్ డస్సెన్ 129 పరుగులతో చెలరేగారు.
నాలుగో వికెట్ కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. శిఖర్ ధావన్ 79 పరుగులు, కోహ్లీ 51 పరుగులు శార్దూల్ ఠాకూర్ 50 పరుగులతో రాణించగా… ఇక మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, షంసీ, పెహ్లు క్వాయో రెండేసి వికెట్లు తీయగా.. మహరాజ్, మార్ క్రమ్ చెరో వికెట్ తీశారు. దీంతో సౌతాప్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.