కోహ్లీ దంపతుల ఉదారత.. రూ. 2 కోట్ల సాయం

-

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉదారత చాటుకున్నారు. కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు భార్య అనుష్కతో కలిసి ఆయన ముందుకొచ్చారు. కరోనా రోగులకు సాయం చేసేందుకు రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. తమ ఫ్యాన్స్ కూడా సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.

దేశంలో నెలకొన్న పరిస్థితులపై కోహ్లీ, అనుష్క ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగులు, బంధువులు పడుతున్న బాధలను తెలియజేశారు. వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, కరోనా రోగులకు సాయం చేసేందుకు నిధి సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కలిసి కట్టుగా సహాయపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాన్ని సురక్షితంగా ధృడంగా తీర్చిదిద్దుతామని కోహ్లీ, అనుష్క పిలుపునిచ్చారు.

దీంతో కోహ్లీ కుటుంబానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగే క్రికెటర్లు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకు రావాలని కోరుతున్నారు. నిజంగా కోహ్లీ సాయంలో కూడా కెప్టెనే అనే పొగడ్తలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news