నార్వే డ్యాన్స్ గ్రూప్​ ‘క్విక్ స్టైల్​తో విరాట్ కోహ్లీ’ స్టెప్పులు.. వీడియో వైరల్

-

టీమ్ ఇండియా స్టార్ బ్యాటరీ విరాట్ కోహ్లీ మంచి డ్యాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విరాట్ డ్యాన్స్​ను మనం చాలాసార్లు చూశాం. తాజాగా కోహ్లీ నార్వే డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్​తో కలిసి చిందులేశాడు. స్టీరియో నేషన్​కు చెందిన ఇష్క్ అనే సాంగ్​కు విరాట్ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సెన్సేషన్​ క్రియేట్ చేస్తోంది.

ఈ వీడియోను కోహ్లీయే స్వయంగా తన సోషల్​మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో మొదటగా గ్రూపులోని ఓ డ్యాన్సర్ కింద పడి ఉన్న బ్యాట్ పట్టుకుని ఏం చేయాలా అన్నట్టుగా చూస్తుంటాడు. ఆ తర్వాత కోహ్లీ.. వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్​లో సింపుల్​గా ఎంట్రీ ఇచ్చి.. ఆ బ్యాట్​ పట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా.. కోహ్లీ వెనక గ్రూప్ వచ్చి చేరుతుంది. అందరూ కలిసి స్టెప్పులేస్తారు.

‘క్విక్ స్టైల్​ను కోహ్లీ కలిస్తే ఇలా ఉంటుంది’ అనే క్యాప్షన్​తో ఈ వీడియోను పోస్ట్​ చేశాడు. ఈ డ్యాన్స్​ వీడియోపై విరాట్ భార్య, హీరోయిన్​ అనుష్క శర్మ కూడా రియాక్ట్ అయింది. ఫైర్ ఎమోజీలను పోస్ట్​ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news