Virata Parvam : విరాట పర్వం మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి రానా, ప్రియమణి, సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ రివేరెల్ చేశారు.


ఈ ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేసింది. ఈ ఏడాది జూలై 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలయింది. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్‌ కూడా వదిలింది. మొదట్లో ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని వార్తలు వచ్చినా.. చివరికి.. థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృఃదం. ఇక ఈ సినిమా ఏ మేరకు ఆ అంచనాలు అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news