ఏపీలో శాంతి భద్రతలు లేవు..ఇక బీజేపీ చూస్తూ ఊరుకోదు : విష్ణువర్ధన్ రెడ్డి

-

ఏపీలో శాంతి భద్రతలు లేవు..ఇక బీజేపీ చూస్తూ ఊరుకోదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆత్మకూరు ఘటన లో బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని.. పోలీసులు వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి కష్టపడాల్సి వచ్చిందన్నారు. పోలీస్ అధికారులపైనా, స్టేషన్ పై దాడి చేశారని… స్థలం విషయంలో వివాదం ఉండగా చర్చించేందుకు వెళ్లిన బీజేపీ నేతలపై దాడి చేశారు, వాహనాలు తగులబెట్టారని వెల్లడించారు. యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదని.. పీఎఫ్ ఐ అనే సంస్థ అమాయకులను వాడుకొని దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయలతోనే ఆత్మకూరు సంఘటన జరిగిందని.. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ని ఎక్కడ ఉంచారో తెలీదు..మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధితులపైనే కేసులు నమోదుచేస్తున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా, నిజాయితీగా పోలీసులు పని చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆత్మకూరు ఘటన వ్యూహాత్మకంగా జరిగిందని.. ఆత్మకూరులో పాశవిక దాడిపై ఉగ్రవాద కోణంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులపై నమ్మకం ఉంది…నిజాయితీగా పనిచేసే అవకాశం కల్పించాలన్నారు.

ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని… ఆత్మకూరు ఘటనపై హోమ్ మంత్రి ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం కూడా ఆత్మకూరు సంఘటనపై స్పందించాలని.. ఏపీ లో శాంతి భద్రతలు లేవని మండిపడ్డారు. గాయపడిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కి వైద్యం చేయించాల్సిన నైతిక బాధ్యత లేదా… అని ప్రశ్నించారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు..శ్రీకాంత్ రెడ్డిని మీడియా ముందు పెట్టాలన్నారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే బీజేపీ ఊరుకోదని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news