విశ్వక్ వింత సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా..?

-

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం దాస్ కా ధమ్కీ.. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలేవి కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇకపోతే ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశ్వక్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది.

ఇకపోతే విశ్వక్ సేన్ తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పేర్ల విషయంలో ఒక సెంటిమెంట్ ని తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట.. అదే దాస్.. ఫలక్ నుమా దాస్ గురించి ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిందే..ఇప్పుడు దాస్ కా ధమ్కీ సినిమాలో కృష్ణ దాస్ అనే పాత్రలో కనిపించనున్నారు. భవిష్యత్తు ప్రాజెక్టులలో కూడా ఆయన దాస్ అనే పేరు ఉండే లాగా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంది అని.. ఆ పేరు అంటే తనకు చాలా ఇష్టం అని కామెంట్లు చేశారు విశ్వక్.. ఇకపోతే ఫలక్ నుమా దాస్ సక్సెస్ సాధించగా.. దాస్ కా ధమ్కీ సినిమా కూడా అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా.. విశ్వక్ సేన్ నైజాం లో ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తున్నారని సమాచారం. దాస్ అనే పేరు పై ప్రేమ ఉందని విశ్వక్ సేన్ చెప్పకనే చెప్పేశారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news