హిందీ , తెలుగు వంటి పలు భాషల్లో బిగ్ బాస్ కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మొదట్లో ఈ షో సెట్ అవుతుందా? లేదా? అన్న ప్రశ్న దక్షణాదిలో నెలకొంది. కానీ అంచనాలను దక్షిణ భారత టీవీ అభిమానులు తారుమారు చేస్తూ సూపర్ హిట్ చేశారు. 2017లో కమలహాసన్ బిగ్ బాస్ తమిళ్ హోస్ట్ గా చేరారు . ఈ షో కి అభిమానుల నుంచి అనూహ్యస్పందన వచ్చింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆరవ సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. అలాగే హిందీలో కూడా 16వ సీజన్ నడుస్తూ ఉండడం గమనార్హం.
ముఖ్యంగా దక్షిణ భారత భాషల్లో కూడా ప్రముఖ తారలు ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. తెలుగులో నాగార్జున, మలయాళం లో మోహన్ లాల్, తమిళ్లో కమలహాసన్ వంటి స్టార్ నటులు బిగ్ బాస్ షో కి హోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలుగులో ఈ బిగ్ బాస్ షో రేటింగ్ రోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో నాగార్జున కూడా తదుపరి సీజన్ కి హోస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈయన దారిలోనే కమలహాసన్ కూడా నడవ బోతున్నారు.
ప్రస్తుతం నాగార్జున లాగానే కమలహాసన్ కూడా వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ నుంచి తప్పకుంటున్నాడనే వార్త వినిపిస్తోంది. కమల్ ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. కాబట్టి వచ్చే సీజన్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ విషయం తెలిసి అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ అభిమానులు కూడా షాక్ కు గురవుతున్నారు. ఏది ఏమైనా స్టార్ హీరోలు ఇలా షో నుంచి తప్పుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి.