ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో వ‌స్తున్న విశ్వ‌క్‌సేన్‌.. విషయం ఏంటంటే!

-

ఎలాంటి స‌పోర్టు లేకుండా వ‌చ్చి నిల‌దొక్కుకున్నాడు హీరో విశ్వ‌క్‌సేన్‌. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత హీరోగా య‌నటుడుగా మారాడు విశ్వక్. టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోగా రాణిస్తున్నాడు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్ తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో డైలాగ్స్, సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉన్నాయి.
దీని త‌ర్వాత ఫలక్‌నామా దాస్‌తో న‌టించి మె నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు విశ్వక్ సేన్. ఈ సినిమాతో విశ్వక్ సేను మాస్‌కా దాస్ తో న‌టించి మెప్పించాడు. ఆ వెంటనే ‘హిట్’ అంటూ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయ‌ని చెప్పాలి.

ఈ సినిమాల త‌ర్వాత విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ పాగల్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు.ఇక ఈ సినిమా చేస్తూనే ఆయన మరో సినిమాను చేయ‌డానికి రెడీ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణంస అనే సినిమాను శుక్రవారం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు మూవీ టీం. ‘అశోకవ‌నంలో అర్జునకళ్యాణంస అనే టైటిల్ చాలా కొత్త‌గా ఉంద‌ని సినీ వ‌ర్గాలు చ‌ర్చంచుకుంటున్నాయి. ఈ సినిమాకు చింత విద్యాసాగర్ డైరెక్ష‌న్ చేస్తున్నాడు. చూడాలి మ‌రి ఈ సినిమా ఎలా ఉంటుందో. ఈ సినిమాతో మ‌రో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news