అక్కినేని అఖిల్.. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చేసినవన్నీ పెద్ద సినిమాలే కానీ ఒక్కటీ చెప్పుకోదగ్గ హిట్ సాధించలేదు. నాగార్జునలాగా పేరు తెచ్చుకోలేక పోతున్నాడు. ఇక నాగచైతన్య తనదైన షైలిలో సినిమాలు చేస్తుంటే.. అఖిల్ మాత్రం అలా కూడా దూసుకుపోలేక పోతున్నాడు. ఇక ఎలాగైనా హిట్ కొట్టాలని పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
బొమ్మరిల్లు మూవీ డైరెక్టర్‌తో చేస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో మనోడు చాలా డిసప్పాయింట్ లో ఉన్నాడు. ఈ నాలుగో సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తెగ కష్టపడుతున్నాడు. అయితే అఖిల్ 5వ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
సైరా సినిమాతో దుమ్ము లేపిన సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మనోడు. ఈ సినిమాకు ఏజెంట్ టైటిల్ ను పెట్టి అనౌన్స్ కూడా చేశారు. దే విధంగా మరో లుక్ ను కూడా ఇటీవల రిలీజ్ చేసి హైప్‌ను పెంచారు. ఈ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ స్టైలిష్ లుక్కుతో అఖిల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెంచేశాడు. ఏజెంట్ సినిమాతో మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టేలా ఉన్నట్లు ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నాగార్జున కూడా ఈ సినిమాతో అఖిల్ ను స్టార్ హీరోను చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమా మనోడిని పెద్ద హీరోను చేస్తుందో లేదో చూడాలి.