అనురాగ్ కశ్యప్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి..!!

-

ఒక పక్క బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవడం, సౌత్ ఇండియన్ సినిమా బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు  కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ ను అసూయగా చూడడం మొదలుపెట్టారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం కావడానికి సౌత్ లు కారణమంటూ ఇటీవల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు ఆయన ఇలాంటి మాజిక్ లు ఒక్కసారే కనెక్ట్ అవుతాయి. మళ్లీ మళ్లీ తీస్తే మాత్రం ప్లాప్ అవుతాయి అని ఇదందా గాలి మహిమ అన్నట్లుగా మాట్లాడారు.దీనితో ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసూయ తోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ నెటిజన్స్ అనురాగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అనురాగ్ మాటలను ఖండించారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అనురాగ్ మాటలను తప్పుపట్టిన  వివేక్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

అనురాగ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైక జెంటిల్ మ్యాన్ అభిప్రాయాలను నేను ఏమాత్రం అంగీకరించను అని గట్టిగా తన సౌత్ ఇండియన్ సినిమా కు అనుకూలంగా ట్వీట్ చేశారు. ఇది చూసి చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్ అయినా కూడా నిజం వైపు నిలబడ్డారని నెటిజన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news