తెలుగు ప్రేక్షకులకు.. తమిళ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఉదయనిది స్టాలిన్.. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఇదిలా ఉండగా ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కొడుకు అన్న విషయం చాలామందికి తెలిసిందే . ఇదిలా ఉండగా తాజాగా ఉదయనిధి స్టాలిన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
ఇకపై తన సినిమాలలో నటించడం లేదని ప్రకటించి.. ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు. ఉదయనిది స్టాలిన్.. రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తాజాగా తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ఉదయినిది స్టాలిన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకమీదట సినిమాలలో నటించను.. కమలహాసన్ సర్ బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నాను.. మారి సెల్వరాజు దర్శకత్వం చేస్తున్న మామన్నార్ తన చివరి చిత్రమని ఉదయ్ నిధి స్టాలిన్ తెలిపారు.
దీంతో అభిమానులు కాస్త ఇబ్బంది పడుతున్నారు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో సినిమాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్నారు. ప్రస్తుతం సినిమాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉదయనిది స్టాలిన్ ఉన్నట్టుండి సినిమాలకు గుడ్ బై చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే సినిమాలకు దూరం కావాల్సిందే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం. ప్రియమైన సినిమాలలో సక్సెస్ పొందిన ఉదయనిది స్టాలిన్ రాజకీయాలలో కూడా సక్సెస్ పొందాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.