వివో నుంచి వరుసగా ఫోన్స్ లాంఛ్ అవుతున్నాయి.. తాజాగా ఇప్పుడు Y సిరీస్ తో Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో మే 22న లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ లాంచ్ కాకముందే దాని ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. మరీ లీకుల ప్రకారం ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
Vivo ఇప్పటికే భారత మార్కెట్లో Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. 6.58-అంగుళాల (1,080×2,408 పిక్సెల్‌లు) Full-HD+IPS LCD డిస్‌ప్లే అందించారు..MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP మాక్రో కెమెరా f/2.0 ఎపర్చర్ లెన్స్‌తో కూడిన 2-MP బోకె కెమెరా ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. USB టైప్-C ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Vivo Y75 4G హైలెట్స్..
లీకైన సమాచారం ప్రకారం.. Vivo Y75 4G సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.44-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తోందని పేర్కొంది.
ఈ Vivo ఫోన్ కిందిభాగంలో MediaTek Helio G96 SoCతో వస్తుంది.
హ్యాండ్‌సెట్ స్టోరేజీ 4GB RAM నుంచి 8GB RAM కూడా రెండు వేరియంట్లలో వస్తుంది.
Vivo Y75 4G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 50-MP ప్రైమరీ సెన్సార్‌తో వస్తోంది.
8-MP సెకండరీ కెమెరా, 2-MP థర్డ్ సెన్సార్‌తో రానుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం..44-MP షూటర్‌తో వస్తుంది.
128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది.
ఈ ఫోన్ బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
Vivo Y75 4G, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,020mAh బ్యాటరీని కలిగి ఉంది. బరువు 172 గ్రాములు కావచ్చు.
ఇక ధర విషయానికి వస్తే.. Vivo Y75 5G 22000వేలు ఉండగా.. Vivo Y75 4G ఫోన్ 21900 ఉంటుందని సమాచారం.