కరోనా రోగుల విషయంలో సమాజం చిన్న చూపు చూస్తుంది. వారిని మరీ దారుణంగా కొందరు ట్రీట్ చేస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు ధైర్యంగా చికిత్స చేస్తున్నా సరే కరోనా అంత్యక్రియలు చేసే విషయంలో ప్రభుత్వాధికారులు కూడా అలసత్వ ధోరణి తో పాటుగా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ వస్తున్నాం.
అయితే అలాంటి వారికి కొన్ని సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ ఎన్జీఓ, యూత్ వెల్ఫేర్ తెలంగాణ స్వచ్చందంగా కరోనా రోగులకు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. దీనిపై మాట్లాడిన సంస్థ అధ్యక్షుడు, జలాలుద్దీన్ జాఫర్, కరోనా కారణంగా స్నేహితుడి తండ్రి మరణించాడని కాని అతని చివరి కర్మలకు అందరూ నిరాకరించారు అని కాని, మానవత్వంతో తాము ముందుకు వచ్చామని, 147 మందికి అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు.