టెలిగ్రాం యాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఇక వీడియో కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాంలో ఇప్ప‌టికే వాట్సాప్‌కు దీటుగా అనేక ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాట్సాప్‌లో ఉన్న వీడియోకాల్ ఫీచ‌ర్ మాత్రం ఇప్ప‌టికీ టెలిగ్రాంలో లేదు. అయితే ప్ర‌స్తుతం టెలిగ్రాం ఇదే ఫీచ‌ర్‌ను త‌న యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇక‌పై టెలిగ్రాం యూజ‌ర్లు వీడియో కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు. కొత్త‌గా అప్‌డేట్ చేయ‌బ‌డిన టెలిగ్రాం వెర్ష‌న్ 7.0.0లో ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

telegram brings video call feature

టెలిగ్రాంలో వీడియో కాల్స్ చేయాలంటే కాంటాక్ట్స్ ప్రొఫైల్‌లోకి వెళ్లి కావ‌ల్సిన కాంటాక్ట్‌ను ఎంచుకుని వీడియో కాల్స్ చేయ‌వచ్చు. ఇక వీడియో, వాయిస్ కాల్స్ మ‌ధ్య సుల‌భంగా మార‌వ‌చ్చు. పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ త‌ర‌హాలో వీడియో కాల్స్ చేసుకునేందుకు సదుపాయాన్ని అందించారు. ఇక చాట్స్ లాగే వీడియోకాల్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల యూజ‌ర్ల‌కు సేఫ్టీ ఉంటుంది.

ఇక కొత్త అప్‌డేట్‌లో వీడియోకాల్స్‌తోపాటు యానిమేటెడ్ ఎమోజీల‌ను కూడా టెలిగ్రాం అందిస్తోంది. అయితే ప్ర‌స్తుతం వీడియోకాల్స్ ఫీచ‌ర్ టెస్టింగ్ ద‌శ‌లోనే ఉన్నా.. అంద‌రికీ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్‌కు మ‌రిన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై యూజ‌ర్లు వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం వాడుకోవ‌చ్చు. ఇక గ్రూప్ వీడియో కాల్స్ కు కూడా త్వ‌ర‌లోనే స‌పోర్ట్‌ను అందివ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news