ఈడీ ఓటుకు నోటు కేసు ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో ఈడీ ఓటుకు నోటు కేసు విచారణ ఇవాళ జరిగింది. ఓటుకు నోటు మనీ లాండరింగ్ కేసు విచారణ నేపథ్యంలో ఇవాళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోర్టుకు హాజరు అయ్యారు. ఈడీ కేసు లో వేం కృష్ణ కీర్తన్, మత్తయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు… ఈడీ ఓటుకు నోటు కేసు ను ఈ నెల 29 కి వాయిదా వేసింది. అలాగే ఓటుకు నోటు ఏసీబీ కేసు విచారణ నవంబరు 1 వ తేదీ కి వాయిదా వేసింది. అటు ఈ ఈడీ కేసు లో విచారణకు మత్తయ్య మాత్రం హాజరు కాలేదు. దీంతో మత్తయ్య పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది నాపంల్లి కోర్టు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరియు సండ్ర వెంకట వీరయ్య సహా నిందితులను రూ.25 వేలతో ఇద్దరు పూచీ కత్తులు సమర్పించాలని అదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు.