హుజూరాబాద్ పోటీలో ఫీల్డ్ అసిస్టెంట్లు..

-

హుజూరాబాద్ బైపోల్ లో పాల్గొనే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు తమ అభ్యర్థులను వెల్లడించింది. దీంతో హుజూరాబాద్ రాజకీయం రసవత్తరంగా మారాయి. పార్టీల మధ్య విమర్శల హోరు మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ధాఖలు చేశారు. మరోవైపు ఈటెల రాజేందర్ ను బైపోల్ అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజా హుజూరాబాద్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. దాదాపు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు చేయాలని ప్లాన్ చేస్తోంది. తమను తొలగించిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేఖంగా పోటీలో నిలుచోనున్నారు. ఇదే విధంగా నిరుద్యోగులు కూడా హుజూరాబాద్ బరిలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత మంది పోటీ చేస్తే ఏపార్టీకి సహయపడుతుందో.. ఏ పార్టీ అభ్యర్థికి దెబ్బపడుతుందో తెలియని పరిస్థితి ఉంది. హుజూరాబాద్ నామినేషన్లకు ఈనెల 8 వరకు గడువు ఉంది. గడవులోపు ఎన్ని నామినేషన్లు దాఖలు అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news