బాబుతో సింపతీ..జనం ఏం అనుకుంటున్నారు?

రాజకీయ నాయకులు అరెస్ట్‌లు కావడం..జైలుకు వెళ్ళడం అనేది కొత్త కాదనే చెప్పాలి. కాకపోతే జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమపై ప్రజల్లో సానుభూతి వస్తుందనేది అనుకుంటున్నారు. అలా వస్తే రాజకీయంగా మరింత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అన్నీ ఆధారాలతో తాము అరెస్ట్ చేశామని ఏపీ సి‌ఐ‌డి చెబుతుంది. దానికి తగ్గట్టుగానే కోర్టు రిమాండ్ విధించింది.

అయితే ఇది జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా చేస్తున్న పని, వ్యవస్థలని చంద్రబాబు మేనేజ్ చేస్తారని ఆరోపణలు చేస్తారు గాని..అసలుమేనేజ్ చేసేది జగన్ అని టి‌డి‌పి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.   అంటే ఇక్కడ బాబు అరెస్ట్ లో రెండు కోణాలు ఉన్నాయి. స్కామ్ లో జైలుకెళ్లడం..కక్షపూరితంగా జైలుకు పంపడం. ఇందులో ఏది నిజమో,..ఏది అబద్దమో ప్రజలకే అర్ధం కాకుండా ఉంది. వైసీపీ వాళ్ళు ఏమో బాబు తప్పు చేశారు కాబట్టి జైలుకు వెళ్లారని,తప్పు చేసిన వారిని చట్టం వదలదు అని అంటున్నారు.

కానీ ఇటు టి‌డి‌పి వాళ్ళు బాబుని కక్షపూరితంగా జైలుకు పంపారని, జగన్ మాదిరిగా వేల కోట్లు కొట్టేసి జైలుకు వెళ్లలేదని, అసలు స్కిల్ స్కామ్ లో బాబుకు డబ్బులు చేరినట్లు ఆధారాలు చూపలేదని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలని ప్రజలు గమనిస్తున్నారని చెబుతున్నారు.

అయితే రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు బాబుకు యాంటీ..ఇటు టి‌డి‌పి బాబుకు ఫేవర్, అటు జనసేన,కమ్యూనిస్టులు కూడా బాబు సపోర్ట్ చేస్తున్నారు. ఇక బి‌జే‌పి, కాంగ్రెస్ ఎటు స్పందించడం లేదు. ఇలా పార్టీల వారీగా ఓట్లు తీసేస్తే..ఇంకా న్యూట్రల్ ఓటర్లు కీలకం. వారు ఏం అనుకుంటున్నారో క్లారిటీ లేదు. వారు గాని బాబుపై సింపతీ చూపిస్తే టి‌డి‌పికి ప్లస్. లేదంటే వైసీపీకి అడ్వాంటేజ్.