వావ్… అచ్చం “విరాట్ కోహ్లీ” లాగే ఉన్నాడు బ్రో !

-

ప్రస్తుతం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో రాణిస్తూ ఇండియాకు విజయాలను అందిస్తున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనూ రాహుల్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి మరొకరు ఎక్కడైనా ఉంటారా ? ఉన్నా మీరు అతన్ని చూశారా ? అంటే ఈ క్షణం వరకు లేదనే అందరూ సమాధానం చెబుతారు. కానీ ఆన్లైన్ లో చండీఘడ్ కు చెందిన ఒక వ్యక్తి ఫోటో మాత్రం మీరు చూస్తే అదేంటి.. విరాట్ కోహ్లీ ఇక్కడున్నాడు అంటూ సందేహించడం కంఫర్మ్. చండీఘడ్ రాష్ట్రానికి చెందిన కార్తీక్ శర్మ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ముఖ కవళికలు కాదు.. నడిచే తీరు, స్టైల్ అంతా కూడా మన కోహ్లీ లానే ఉండడం గమనార్హం.

ఇతని చుసిన అందరూ కూడా కోహ్లీ అనుకుని తెగ ఫోటోలకోసం అడుగుతూ ఉన్నారట. అయితే కార్తీక్ శర్మ మాత్రం నేను కోహ్లీ ని కాదు అంటూ వాస్తవాన్ని చెబుతున్నాడు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news