అప్పుల్లో రికార్డు సృష్టించిన తెలంగాణ మంత్రి కేటీఆర్..ఏకగా రూ. 27 కోట్లు !

-

సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. ట్విట్టర్, ఫోన్ ద్వారా సమాచారం పంపితే చాలు వెంటనే స్పందిస్తారు. అలాంటి మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న మంత్రుల టాప్ 10 జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరారు. 27 కోట్ల 73 లక్షల 15 వేల 880 రూపాయల అప్పులతో, జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు కేటీఆర్.

అయితే దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రి మండలిపై ఏడిఆర్ అనే వెబ్సైటు ఓ రిపోర్టు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించే అఫీడవిట్ ల ఆధారంగా, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను రిపోర్టు రూపంలో విడుదల చేసింది ఏడిఆర్ వెబ్సైట్. ఈ రిపోర్టుతో కేటీఆర్ కు ఉన్న ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని అనే వివరాలు కూడా ఉండటంతో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. కాగా, కేటీఆర్ కు మొత్తం 41 కోట్ల 82 లక్షల 94 వేల 428 రూపాయల ఆస్తి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news