జగన్ పరువు మళ్ళీ పోయింది గా…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. కక్ష సాధింపు తో జగన్ తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అనవసరంగా జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని జాతీయ మీడియా కూడా పలు మార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు మళ్ళీ పోయింది.

అమెరికాకు చేసిందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఒక కథనం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంట్ వాడుకుని డబ్బులు కట్టడం లేదని తన కథన౦లో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోలార్ విద్యుత్ వినియోగంపై వాల్ స్ట్రీట్ ఒక కథనం రాసింది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలు విద్యుత్ సంస్థలు చేస్తున్న ఆరోపణలను ప్రత్యేకంగా ప్రస్తావించింది వాల్ స్ట్రీట్.

మోడీ సర్కార్, 2030 నాటికల్లా 450 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అయితే ఈ లక్ష్యంలో కొన్ని అడ్డంకులు ఎదురు అవుతున్నాయని, దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. సోలార్ విద్యుత్‌ను అధికంగా వినియోగించుకోవడంలో ఏపీ ఆగ్రస్థానంలో ఉందని చెప్పింది.

కాని బకాయిలు మాత్రం చెల్లించడంలో కూడా ముందే ఉందని పేర్కొంది. విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ బిల్లులను సరిగ్గా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుందని చెప్పింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఒప్పందాల విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల విషయంలో పలు విద్యుత్ సంస్థలు ఆవేదన కూడా వ్యక్తం చేసి జగన్ పై విమర్శలు చేసాయి.

Read more RELATED
Recommended to you

Latest news