ఎల్‌పిజి సిలిండర్ల డోర్ డెలివరీకి వచ్చే నెల నుండి ఒటిపి లేదా వన్‌టైమ్ పాస్‌వర్డ్ అవసరం అని వార్తలు వస్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ తీసుకోవాలి అనుకునే వ్యక్తులు కచ్చితంగా ఓటీపీ చెప్పాల్సిందే. చమురు కంపెనీలు… సిలిండర్ల దొంగతనాలను నివారించడానికి మరియు అసలు కస్టమర్ ను గుర్తించడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డిఎసి) అనే కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నాయని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.
ఎల్‌పిజి సిలిండర్ల ఇంటి డెలివరీ కోసం డిఎసి ప్రక్రియ మొదట 100 స్మార్ట్ సిటీలలో అమలు చేస్తారు. అప్పుడు వినియోగదారులు దీని వలన ఎలాంటి ఇబ్బంది పడకపోతే కచ్చితంగా దీన్ని ఇతర నగరాల్లో కూడా అమలు చేస్తారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. డెలివరీ కొత్త ప్రక్రియ చాలా సులభం అని అధికారులు అంటున్నారు. ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు, అతడు / ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై కోడ్ పొందుతారు. డెలివరీ సమయంలో, వినియోగదారులు ఎల్‌పిజి సిలిండర్ ను తీసుకోవడానికి కోడ్ చూపించాలి.