విదేశాల్లో న్యూ ఇయర్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ తో ఇక్కడకి వెళ్ళొచ్చేయండి..!

-

ఈసారి న్యూ ఇయర్ ని మీరు స్పెషల్ గా జరుపుకోవాలని అనుకుంటున్నారా..? ఇండియాలో కాకుండా ఏదైనా విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారా..? తక్కువ బడ్జెట్ తో న్యూ ఇయర్ వేడుకలను ఈ ప్రదేశాలలో జరుపుకోవచ్చు. ఈ విదేశాలలో న్యూ ఇయర్ ని చేసుకోవడం చాలా బాగుంటుంది పైగా మీరు తక్కువ ఖర్చుతోనే ఈ ప్రదేశాలకు వెళ్లి వచ్చేయొచ్చు.

 

దుబాయ్:

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో బాగా జరుపుతారు. అక్కడ ఆహారం సంస్కృతిని మీరు ఆస్వాదించచ్చు. ది పామ్, బుర్జ్ అల్ అరబ్, బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగుంటాయి.

బాలి, ఇండోనేషియా:

బాలి లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా బాగా చేస్తారు. ఇండోనేషియా కి కూడా బడ్జెట్ లోనే మీరు వెళ్లి రావచ్చు.

మాల్దీవులు:

కొత్తగా పెళ్లైన వారు ఇక్కడకి వెళ్లేందుకు ఇష్టపడుతూ వుంటారు. మాల్దీవుల్లోని ప్రశాంతమైన బీచ్‌లు ఆకట్టుకుంటాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇక్కడ కూడా బాగా చేస్తారు.

కొలంబో, శ్రీలంక:

అద్భుతమైన సీఫుడ్, బీచ్ సైడ్ రిసార్టులు ఇవన్నీ కూడా బాగుంటాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తక్కువ ఖర్చు తో విదేశాల్లో చేసుకోవాంటే మీరు ఇక్కడకి కూడా వెళ్ళచ్చు.

బ్యాంకాక్, థాయిలాండ్:

ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలను ఎంతో చక్కగా ఘనంగా చేస్తారు. అలానే చాలా మంది బ్యాచిలర్ పార్టీలకు కూడా వెళ్తూ వుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news