ఎవరైనా సరే బరువు తగ్గాలని అనుకునేటప్పుడు ఆరోగ్యంగా బరువు తగ్గాలని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గినప్పుడే మీ భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరి ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా తీసుకురావడం జరిగింది. ఇక అదేమిటంటే.. తీసుకొనే ఆహారంలో మార్పులు, జీవనశైలి, ఒత్తిడి కారణాలవల్ల బరువు పెరుగుతారు. అయితే ఈ బరువు ఎక్కడ ఎలా పెరుగుతున్నామో అనే విషయాన్ని ముందుగా మీరు గమనించాలి . ఆ తర్వాత క్రమక్రమంగా బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చు.
ఇకపోతే నెలరోజులు కనుక ఇప్పుడు చెప్పే రెగ్యులర్ డైట్ పాటించడం వల్ల తప్పకుండా 5 నుంచి 6 కిలోల బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా రొట్టెలు తినడం వల్ల బరువు తగ్గుతారు అని నిపుణుల సైతం చెబుతున్నారు. అలాంటి వాటిలో ముందుగా జొన్న రొట్టె కూడా ఒకటి.. జొన్నలతో తయారుచేసిన రొట్టెలు తరచూ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు మీకు లభించి మీరు ఆరోగ్యంగా అలాగే బరువు కూడా తగ్గవచ్చు.
సజ్జ రోటీ:
సజ్జ పిండిలో మనకు ఫైబర్, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది కాబట్టి ఒకసారి వీటితో తయారు చేసిన రొట్టెలు తిన్నట్లయితే ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. పైగా ఈ ఆహారం తీసుకోవడం వల్ల మీరు తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు.
ఓట్స్ రోటీ:
సాధారణంగా మనం తీసుకునే అల్పాహారంలో ఓట్స్ ఉండాలని చెబుతూ ఉంటారు వైద్యులు. అయితే ఈ ఓట్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు, ఫైబర్ ఉండడంతో పాటు రక్తంలో చక్కర స్థాయి కూడా నియంత్రించబడుతుంది. కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించే ఈ ఓట్స్ తో తయారు చేసుకునే రోటీలు మరింత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే బరువును తగ్గించుకోవచ్చు.
బార్లీ రోటీ:
బార్లీ పిండితో తయారు చేసిన రోటీలు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. ఇకపోతే ఈ కారణాలవల్ల బరువు క్రమంగా తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.