లిఫ్ట్ లో ఇరుక్కున్న వరంగల్ మేయర్ సుధారాణి

-

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపాలిటీ మేయర్‌ గుండు సుధారాణి కి ఊహించని పరిణామం ఎదురైంది. మేయర్‌ గుండు సుధారాణి.. ఇవాళ ఓ లిఫ్ట్‌ లో ఇరుక్కు పోయారు. హన్మకొండ జిల్లా లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభించడానికి మేయర్‌ గుండు సుధారాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆ ప్రయివేటు ఆస్పత్రిని మేయర్‌ గుండు సుధారాణి ప్రారంభించారు.

అనంతరం అక్కడి పరిసరాలు చూశారు. ఈ నేపథ్యం లోనే రెండో అంతస్తు కు వెళ్లారు మేయర్‌ గుండు సుధారణి. అయితే… ఈ నేపథ్యంలో లిఫ్ట్ ఎక్కిన మేయర్ గుండు సుధారాణి…. అందులోనే ఇరుక్కు పోయారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర సుధారాణి అందులోనే ఉండిపోయారు. అయితే.. అక్కడ ఉన్న ఉన్న సిబ్బంది మరియు నాయకులు కష్టపడి.. ఆ లిఫ్ట్‌ ను ఓపెన్‌ చేశారు. దీంతో మేయర్‌ గుండు సుధారాణి…లిఫ్ట్‌ నుంచి బయటికి వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news