గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రము మొత్తం వర్షాల కారణంగా నీటిలో ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాలలో అయితే నీళ్లు తమ ఇళ్లల్లోకి వచ్చి నానా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వర్షాల ప్రభావంతో కొందరు ప్రాణాలను వదలగా చాలా మంది పునరావాసాలను కోల్పోయిన బాధాకర పరిస్థితులు చూశాము. తాజాగా వరంగల్ జిల్లాలోని భద్రకాళి చెరువుకు గండి పడిందని ప్రజలు ఆందోళన పడుతున్నారు. కాగా ఈ విషయంపై వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగర ప్రజలు ఎవ్వరూ ఈ విషయం గురించి అలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు, భద్రకాళి చెరువుకు ఎటువంటి పరిస్థితుల్లో గండి పడకుండా తగిన చర్యలు మేము తీసుకునే పనిలో ఉన్నామని తెలిపారు. ఇక ఈ విషయంలో తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులకు సలహాలు ఇస్తున్నారు.
మరి ఈ భద్రకాళి చెరువు గండి పడుతుందా లేదా అన్నది తెలియాలంటే సమయం వెయిట్ చేయాల్సిందే.