ఆస్పత్రి లో ఉండే వార్డ్ బాయ్ ఏకం గా డార్టర్ అవతారం ఎత్తాడు. అంతే కాకుండా ఒక వ్యక్తి కి చికిత్స కూడా చేశాడు. ఇంక ఏముంది.. పేషంట్ మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ బెంగల్ లో చోటు చేసుకుంది. బెంగల్ లోని ఝూన్సి బజార్ లోచ అష్ట రాయ్ అనే వ్యక్తి ఓ బంగారం షాపు లో పని చేస్తున్నాడు. అష్ట రాయ్ కి నిన్న రాత్రి కడుపు నొప్పి రావడం తో.. స్థానికం గా ఉన్న ఒక ఆస్పత్రి కి అష్ట రాయ్ వెళ్లాడు. అష్ట రాయ్ ఆస్పత్రి కి వెళ్లే సమయానికి డాక్టర్ అందు బాటు లో లేడు.
దీంతో అక్కడ ఉన్న వార్డు బాయ్.. అష్ట రాయ్ కు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో అష్ట రాయ్ వెంటనే అపస్మారక స్థితి కి వెళ్లాడు. అంతే కాకుండా కొద్ది సమయం తర్వాత అష్ట రాయ్ మరణించాడు. దీంతో అష్ట రాయ్ చనిపోవడం తో అతని కుటుంబ సభ్యులు పోలీసుల కు ఫీర్యాదు చేశారు. వార్డు బాయ్ వల్లే అష్ట రాయ్ చనిపోయాడని.. అతని ఇచ్చిన ఇంజెక్షన్ వళ్లే మరణించాడని పోలీసుల ఫీర్యాదు లో తెలిపారు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.