#warriors4ssr ట్విట్టర్‌ని షేక్‌ చేస్తున్న సుషాంత్‌ అభిమానులు నిరసన

-

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుశాంత్‌కి న్యాయం జరగాలంటూ #warriors4ssr పేరుతో ట్విట్టర్‌ను కుదిపేస్తున్నారు సుశాంత్‌ అభిమానులు. #warriors4ssr హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్ చేయడం ద్వారా ట్విట్టర్‌ వేదికగా పెద్దయెత్తున డిజిటల్ నిరసనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. సుశాంత్ అభిమానులతోపాటు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అర్నబ్‌ గో స్వామి, రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి సుబ్రమణియన్‌ స్వామి వంటి ప్రముఖులు కూడా తమ మద్దతును తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ వికాస్ గుప్తా, సుశాంత్ సోదరి శ్వేతా ఈ నిరసనలో పాల్గొన్నారు.

 

శుక్రవారం మొదలైన ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో టాప్‌లో ఉంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటి హత్యేనంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సుషాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి మరియు, కొదరు బాలీవుడ్‌ పెద్దల హస్తం ఉందంటూ సోషల్‌మీడియాలో పెద్దదుమారమే లేస్తుంది.

సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిండమే కాకుండా ఈడీ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. ఈకేసును సిబిఐ సహా ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్‌ కేసు విషయమై సీబీఐ మొత్తం 20 పేజీలతో కూడా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. అందులో నటి రియా చక్రవర్తిని ఎ1గా చేర్చింది. అలాగే ఇంద్రజిత్‌ చక్రవర్తి(రియా తండ్రి)ని ఎ2గా, సంధ్య చక్రవర్తి(రియా త‌ల్లి)ని ఎ3గా, శౌవిక్‌ చక్రవర్తి(రియా సోద‌రుడు)ని ఎ4గా, శామ్యూల్‌ మిరాండా(సుశాంత్ ఇంటి మేనేజ‌ర్‌)ను ఎ5గా, శృతి మోదీ(రియా మాజీ మేనేజ‌ర్‌)ని ఎ6గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇక మొత్తం 8 సెక్షన్ల కింద కేసు సీబీఐ కేసు నమోదు చేసింది. 120బి, 306, 341, 342, 380, 406, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక ఇప్ప‌టికే రియా చ‌క్ర‌వ‌ర్తితోపాటు ఆమె వ్య‌వ‌హారాలు చూసే శామ్యూల్ మిరాండాకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news