బెస్ట్ సీఎం : కేసీఆర్ ని మించిపోయిన జగన్..!

-

అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజా క్షేమమే దేయంగా పరిపాలనలో దూసుకుపోతూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆకర్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా ఖ్యాతి గడించారు. అయితే తాజాగా.. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో జులై 15 నుంచి 27 మధ్య నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు.

Cm Jagan

కాగా, మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఏఏపీ) నిలవగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news