ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉంటుంది. వాషింగ్ మిషన్ వలన బట్టలు ఉతుక్కోవడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ కొన్ని సమస్యల వలన వాషింగ్ మిషన్లు పేలిపోతున్నాయి. బాంబులు మాదిరిగా వాషింగ్ మిషన్స్ పేలిపోతున్నాయి ఈ వార్తలని మీరు వినే ఉంటారు. లక్నోలో ఒక మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్ కొట్టి చనిపోయింది ఇటువంటి ప్రమాదాలు ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
కొన్ని చిట్కాలని పాటిస్తే ప్రమాదాలు జరగవు. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణానికే ప్రమాదం. కొంతమంది ఈ సమస్యను నేనే పరిష్కరించగలను అని రిపేర్ చేస్తూ ఉంటారు కానీ నిజానికి అలా చేయకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వాషింగ్ మిషన్ కి సంబంధించిన వైర్లు ఏమైనా తెగిపోయినట్లు మీరు గమనిస్తే టెక్నీషియన్ ని పిలిపించి బాగు చేయించుకోండి. ప్లగ్ కి సంబంధించిన వైర్లని కూడా చూసుకోండి ఒకవేళ ఏమైనా తెగినట్లు అనిపిస్తే మార్పించండి లేకపోతే షాక్ కొట్టచ్చు.
వాషింగ్ మిషన్ ని ఉపయోగిస్తున్నప్పుడు నీరు నియంత్రణ ప్యానల్ పై పడకూడదు యంత్రాన్ని నియంత్రించే బటన్ పై చాలా సార్లు నీరు పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు అశ్రద్ధ చేయకండి. వాషింగ్ మిషన్ ని ఎప్పుడు అనుభవజ్ఞుడైన సాంకేతిక నిపుణులతో రిపేర్ చేయించాలి ఎవరు పడితే వాళ్ళు వాషింగ్ మిషన్ రిపేర్ చేయకూడదు. మోటార్ స్క్రూలు కూడా సరిగ్గా బిగించడం మర్చిపోకూడదు. సర్వీసింగ్ చేయించడం కూడా ముఖ్యం వీటిని ఫాలో అయితే వాషింగ్ మిషన్ పేలిపోదు.