టాలీవుడ్ హీరోయిన్ మోజులో పడి కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వబోతున్న బాలీవుడ్ హీరో..!

-

సినీ ఇండస్ట్రీలో బంధాలు, బంధుత్వాలు ఎప్పుడు ఏ విధంగా ఏర్పడతాయో.. ఏ విధంగా తెగిపోతాయో చెప్పడం కష్టంగా మారిపోయింది. ఒకరి మీద ఒకరికి వ్యామోహం అనేది మరింతగా ముదిరినప్పుడు తమకు భార్య బిడ్డలు ఉన్నారు అన్న విషయాన్ని కూడా కొంతమంది మరిచిపోతున్నారు. మరొకవైపు వారికి భార్యా పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి హీరోయిన్లు అవకాశాల కోసం వారిని తమ వలలో వేసుకుంటున్నారనే చెప్పాలి. అవకాశాల కోసం, డబ్బు కోసం చాలామంది దిగజారుతూ విమర్శల పాలవుతూ ఉంటారు.

ఇప్పటికే చాలామంది నటీనటులు బడా ఆఫర్ల కోసం చాలావరకు దిగజారారనే చెప్పాలి. ముఖ్యంగా గ్లామర్ షోలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మరికొంతమంది స్టార్ హోదాలో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తాను మరింత హోదా పొందడానికి ఏకంగా బాలీవుడ్ బడా హీరోను తన వలలో వేసుకుంది. అంతేకాదు ఆయన ఫ్యామిలీకి అసలైన చిచ్చు పెట్టింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

పైగా గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను దోచుకొని ఎప్పుడూ ట్రెండును ఫాలో అయ్యే ఈ ముద్దుగుమ్మ బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు దక్కించుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్న ఈమె బాలీవుడ్ పై తన మనసు పారేసుకుంది. అక్కడ అవకాశాల కోసం ఒక బడా సీనియర్ హీరోతో పరిచయం పెంచుకొని అతని డైరెక్షన్ లోనే ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోందట. అంతేకాదు అతనితో బంధం బలపరుచుకోవడానికి ఏకంగా వివాహ బంధాన్ని సెట్ చేసుకోవాలని చూస్తోందట. ఆ స్టార్ హీరో కూడా ఈమె మోజులో పడి తన భార్యకి విడాకులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని సమాచారం. అయితే అవకాశాల కోసమే ఈమె అతడిని వాడుకుంటోందని.. ప్రేమతో మాత్రం కాదు అని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news