హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు కీలక సూచన చేశారు. అదేంటంటే ఈ నెల 31న నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అందుకు తగ్గట్టు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు కాబట్టి ముందు రోజు పట్టుకున్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2, 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపు లైన్ లకు మరమ్మత్తులు చేపతున్నారు.
ఈ నేపధ్యంలో అక్టోబర్ 31 ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నవంబర్ 1 ఉదయం 6గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏయే ఏరియాలలో నీరు ఉండదు అంటే, మెహదీపట్నం, కార్వాన్, లాంగర్ హౌస్, కాకతీయ నగర్, హుమాయన్ నగర్, ఆసిఫ్ నగర్, ఎంఇఎస్, షేక్ పేట్, ఓయు కాలనీ, టోలిచౌకి, మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్ హిల్స్, సెక్రటేరియట్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అల్లా బండా, గగన్ మహల్, హిమయత్ నగర్, బుద్వెల్, హైదర్ గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, అత్తా పూర్, చింతల్ మెట్, కిషన్‌బాగ్, గంధంగూడ, కిష్మత్ పూర్ ప్రాంతాల్లో నీటి సరఫరా 24 గంటల పాటు ఉండదు.