బెంగళూరులపై ముంబై ఇండియన్స్ భారీ విక్టరీ కొట్టింది..ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ముంబై అదరగొట్టింది. బెంగళూరుపై అయిదు వికెట్ల తేడాతో గెలిచింది.దీంతో ప్లే ఆఫ్‌కు చెరింది ముంబై..ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది..ఆడిన 12మ్యాచ్‌ల్లో 8 విజయాలు, నాలుగు ఓటములతో.. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్ చేరింది. ఐపీఎల్ చరిత్రలో 9సార్లు ప్లేఆఫ్‌కు చేరిన జట్టుగా ముంబై నిలిచింది. చెన్నై 10సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణిత ఓవర్లలో 165పరుగుల చేసింది..తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది..ముంబై బ్యాట్స్‌మన్లలో సూర్యకుమార్ యాదవ్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు..ఓపెనర్లు డికాక్ 18,ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
బెంగళూరుపై ముంబై విక్టరీ..ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-