మిషన్ కాకతీయ ఎఫెక్ట్..పెరిగిన భూగర్భ జలాలు..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన కీలక పథకాల్లో ఒకటి మిషన్ భగీరథ కాగా మరొకటి మిషన్ కాకతీయ. మిషన్ భగీరథ పథకాన్ని ఇంటింటికి తాగు నీరు అందించే ఆలోచనతో కేసీఆర్ ప్రారంభించారు. అదే విధంగా మిషన్ కాకతీయ పథకాన్ని రాష్ట్రం లోని చెరువుల పూడికను తీసేందుకు ప్రారంభించారు. అయితే తాజాగా మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ లో నీటి మట్టం పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది.

water dispute | జల వివాదం
water dispute | జల వివాదం

రాష్ట్రం లోని 46,530 చెరువులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని షురూ చేసింది. అయితే ఈ పథకం కింద చెరువుల పూడికను తిట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని కాగా పార్లమెంట్ కు నివేదిక సమర్పించింది. 2012-2013 లో తాము అధ్యయనం చేయగా 10టిఎంసి ల మేర భూగర్భ జలాలు ఉంటే ఇప్పుడు 11.4 టిఎంసీ లకు భూగర్భ జలాలు చేరాయని పేర్కొంది.