నేడు నిర్మల్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

నేడు నిర్మల్ జిల్లాలో వైఎస్ఆర్ టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పర్యటించనున్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా నిన్న రాత్రి వైఎస్ఆర్ టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. నిన్న రాత్రికి జిల్లా కేంద్రంలోనే వైఎస్ షర్మిల బస చేశారు. ఇక ఇవాళ నిర్మల్ జిల్లాలో రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల.

దిలవార్ పూర్, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించ నున్నారు వైఎస్ షర్మిల. అనతరం ఆమె మీడియా తో మాట్లాడతారు.

కాగా నిన్న రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల‌… మంత్రి కేటీఆర్ పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇలాఖాల్లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు సిగ్గు చేట అని మండిప‌డ్డారు. ఇక్క‌డికి రాకుండా గ్రామ‌స్తుల‌ను బెదిరించే హ‌క్కు కేటీఆర్ కు ఎక్క‌డిది ? అని ప్ర‌శ్నించారు. మీ సత్తాలేని పాల‌న‌ వల్లే రైతుల ఆత్మహత్యలు, ఇంగితమే ఉంటే రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.