వాహనదారులు మాత్రం అక్కడే రోడ్డుపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించి.. వేలు పెట్టి కొనుక్కున్న బైక్ ను నాశనం చేసుకున్నామని… దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాధానం చెప్పాలని… తమకు నష్టపరిహారం ఇవ్వాలని బంక్ వద్దే నిరసన తెలిపారు.
పెట్రోల్ కు, నీళ్లకు పడుతుందా అసలు. పెట్రోల్ లో నీళ్లు కలిపితే.. అలా నీళ్లు కలిపిన పెట్రోల్ ను బైక్ లో పోస్తే బండి స్టార్ట్ అవుతుందా అసలు. వాహనాల ఇంజిన్లు ఖరాబు అయిపోవాల్సిందే. పది రూపాయల కక్కుర్తి కోసం వేలు, లక్షలు పోసి కొనుక్కున్న వాహనాలను పక్కన పెట్టాల్సిందేనా?
హైదరాబాద్ లో ఇటువంటి దారుణమే ఒకటి జరిగింది. నగరంలోని చైతన్యపురిలో ఉన్న హెచ్ పీ పెట్రోల్ పంప్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు వెంటనే ఆగిపోతుండటంతో అనుమానం వచ్చి పెట్రోల్ ను బాటిల్ పోయించి చెక్ చేయగా.. అందులో పెట్రోల్ కంటే కూడా ఎక్కువగా నీళ్లే కలిశాయని.. ఈ విషయంపై బంక్ యాజమాన్యాన్ని నిలదీస్తే తమకు సంబంధం లేదని.. ట్యాంకర్లలో వచ్చిన పెట్రోల్ నే తాము ఇక్కడ పోస్తున్నామనే దాటవేత సమాధానాన్ని చెప్పారు.
అయితే… వాహనదారులు మాత్రం అక్కడే రోడ్డుపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించి.. వేలు పెట్టి కొనుక్కున్న బైక్ ను నాశనం చేసుకున్నామని… దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం సమాధానం చెప్పాలని… తమకు నష్టపరిహారం ఇవ్వాలని బంక్ వద్దే నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.