ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ తో అద్భుతమయిన ఆదాయం పొందే మార్గాలు..!

-

సాధారణంగా సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు పొదుపు చేయడం వల్ల అంత ఆదాయం రాదు. సేవింగ్స్ అకౌంట్ తో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు కాస్త ఎక్కువే. వీటిలో నష్ట భయం కూడా ఉండదు అందుకే సీనియర్ ఇన్వెస్టర్లు, ఇంకా పెట్టుబడిదారులు వీటిపై ఆసక్తి చూపుతుంటారు.మెచ్యూరిటీ తీరాక ఎఫ్‌డీలపై మంచి రాబడి వస్తుంది.ఇదేకాకుండా రెగ్యులర్ ఇన్‌కమ్ పొందే అవకాశం ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మార్గాలు కూడా ఉన్నాయి. అవే ల్యాడరింగ్ టెక్నిక్, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్.

money invest
money invest

ఈ పద్దతిలో పెట్టుబడిదారులు వివిధ బ్యాంకుల్లో వేర్వేరు కాల వ్యవధితో కొంత మొత్తం అన్ని బ్యాంకుల్లో ఎఫ్‌డీలు లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి చేసుకోవాలి. లిక్విడిటీని మేనేజ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో వడ్డీ రేట్ల తగ్గటం, రీ ఇన్వెస్ట్‌మెంట్ వంటి రిస్క్ లకు అంతగా ఉండవు. ఉదాహరణకు..మీరు రూ.3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, ఆ డబ్బంతా ఒకే బ్యాంకులో ఒక సంవత్సరానికి ఎఫ్‌డీ చేయకూడదు. 3 లక్షల రూపాయలను మూడు సమాన భాగాలుగా విభజించి, ఒక్కో భాగాన్ని వేరు వేరు బ్యాంకుల్లో,వేరు వేరు గడువులతో, పెట్టుబడి పెట్టాలి. ఈ పద్దతిలో పెట్టుబడిదారులు నిశ్చింతగా రాబడిని పొందవచ్చు.

ఈ కార్పొరేట్ ఎఫ్‌డీలకు ICRA ,క్రిసిల్ సంస్థలు అధికంగా FAAA రేటింగ్ ను అందిస్తున్నాయి. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడిదారులు బ్యాంక్ డిపాజిట్లకంటే ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. దీంట్లో వినియోగదారులకు మరింత లాభం చేకూర్చే ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లు తమకు డబ్బు అవసరమైనప్పుడు డిపాజిట్లను కొంత విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంది. కానీ డిపాజిట్ చేసిన మూడు నెలల తరువాతే ఇందుకు అవకాశం కల్పిస్తారు. స్వల్ప, మధ్యస్థ కాల సమయంలో తక్కువ మొత్తంలో డబ్బు కూడ బెట్టుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. తక్కువ పన్ను పరిధిలో ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక.

Read more RELATED
Recommended to you

Latest news