ద్రవ్యోల్బణం కట్టడికి కృషి చేస్తున్నాం – నిర్మల సీతారామన్

-

ద్రవయోల్బణం కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. నేడు జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తీసుకువచ్చే అంశం కేంద్రం నిర్ణయం పై ఆధారపడి లేదని, ఆ నిర్ణయంలో రాష్ట్రాలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలను జిఎస్టి కౌన్సిల్ అజెండాలో పెడుతున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

దేశీయ ఉత్పత్తి పెంచేందుకు రైతులను పప్పులు పండించమని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. తక్కువ ధరకు అందుబాటులో ఉండేందుకు కొన్ని పప్పులపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించామన్నారు. ద్రవయోల్బణం కట్టడికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఇదో ఉదాహరణ అని.. వంట నూనెల పై కూడా శుంకాన్ని గత మూడు ఏళ్లలో భారీగా తగ్గించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news