సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..తాము 58 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. ‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల ఆర్బీకేలు, 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం. నాడు నేడుతో స్కూళ్లు, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చాం’ అని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ‘భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంతోపాటు మిగతా విమానాశ్రయాల విస్తరణ జరుగుతోంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగం బలోపేతం కోసం ఆసరా, చేయూత, కాపు నేస్తం, EBC నేస్తం, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం పథకాల ద్వారా సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.