ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని నరేంద్ర మోదీ, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అందులో అనేక విషయాలు మాట్లాడారు. ఇండియాలో అమలు అవుతున్న అనేక సంక్షేమ పథకాలు, వాటి తీరు, ఇంకా చేరాల్సిన పథకాల గురించి చెప్పుకొచ్చారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలని చెప్పారు. వచ్చే రెండేళ్ళలో నల్లా ద్వారా అందరికీ సురక్షిత నీరు అందించాలి. పోషకాహార లోపం ఉండకుండా చూడాలని మాట్లాడారు.
ఈ నేపథ్యంలో రేషన్ షాపుల్లో పోషకాహార ధాన్యాలు అందుబాటులో ఉంచాలని, అందుకు తగిన ఏర్పాటు జరగాలని సూచించారు. మండల స్థాయి వరకు వైద్య సౌకర్యాల ఏర్పాటు సరిగ్గా జరగాలని, ప్రతీ ఆస్పత్రిలో వసతులతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ఖచ్చితంగా ఉండాలని అన్నారు. ఇంకా, రాష్ట్రాల అధికారాల విషయమై మాట్లాడిన ప్రధాని, ఓబీసీల్లో ఎవరు ఉండాలనేది రాష్ట్రాలకే వదిలేసామని, అందులో పూర్తి స్వేఛ్ఛ రాష్ట్రాలకే ఇచ్చామని తెలిపారు.