దేశ విభజన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి.. ప్రధాని మోదీ.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబారాన్ని అంటుతున్నాయి. దేశం నలువైపుల మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని మోదీ, జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అటు ప్రపంచ దేశాలు భారతదేశానికి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ సహా ఇతర దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న ప్రధాని, వారి జీవితాల నుండి స్ఫూర్తి పొందాలని పిలుపు ఇచ్చారు. స్వాతంత్ర్య సమర సమయంలో జరిగిన దేశ విభజన, ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా నిలిచిందని, స్వాతంత్ర్య సమరంలో ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్నవారి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని అన్నారు. దేశ అభివృద్ధి కోసం సంకల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని ప్రసంగించారు.