కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ఆటో మొబైల్ రంగం చాలా వరకు కూడా నిర్వీర్యం అయిపోయింది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆటో మొబైల్ రంగం దాదాపుగా ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. వాహనాల విక్రయాలు లేకపోవడం, స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని పరిస్థితికి ఈ రంగం దిగజారింది. ఇప్పుడు హార్లీ డేవిడ్ సన్ ఒక సంచలన విషయం వెల్లడించింది.
తాను పడుతున్న కష్టాలను ఒక నివేదిక రూపంలో చెప్పింది. హార్లే- డేవిడ్సన్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించిందని పేర్కొంది. 2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించిందని నివేదికలో ప్రస్తావించింది. అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూసినా సరే భారత్ లో ఇది అత్యంత చెత్త మార్కెట్ అని పేర్కొంది.