ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ రెండు కొత్త ప్లాన్ల‌తో ఉచితంగా హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌..

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం కొత్త‌గా రూ.448, రూ.599 ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్ల‌తో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రూ.599 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు నిత్యం 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. దీనికి ఏడాది కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందిస్తారు. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సేవ‌లు, ఉచిత హ‌లో ట్యూన్స్‌, ఉచిత వింక్ మ్యూజిక్ యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ల‌భిస్తాయి.

airtel gives free hotstar subscription on these two new plans

రూ.599 ప్లాన్‌తో క‌స్ట‌మ‌ర్లు ఫాస్టాగ్ పై రూ.150 క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. అలాగే అప్‌స్కిల్‌లో షా అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో ఏడాదిపాటు ఉచితంగా ప‌లు ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకోవచ్చు. రూ.448 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఇందులోనూ ఏడాది కాల్య‌వ‌వ‌ధి గ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందిస్తారు. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీం, వింక్ మ్యూజిక్ సేవ‌ల‌ను కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఇందులోనూ పైన తెలిపిన ఇత‌ర ఆఫర్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఇక రెండు ప్లాన్ల‌లోనూ క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. కాగా ఎయిర్‌టెల్ ఇటీవ‌లే రూ.129, రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను మ‌రిన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. వీటికి 24 రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్‌, జీ5, వింక్ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీం యాప్‌ల‌కు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ లు ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news